మతోన్మాద పాలకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన సీపీఎం పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సీపీఎం పార్టీ బరిలో ఉంటుందని, ఈనెల 29న అభ్యర్థిని ప్రకటించి 30న నామినేషన్ వేస్తామని ఆయన తెలిపారు. సింగరేణి కార్మికులకు బోనస్ ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో దేశంలో సామాన్య ప్రజలు నిత్యవసరాలు సైతం కొనలేని స్థితిలో ఉన్నారని ఆయన విమర్శించారు.
ఇదీ చదవండిః వినోద్ ట్వీట్‌కు... కేటీఆర్ ఏం చేశారంటే!