ETV Bharat / state

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆన్​లైన్​ టికెట్ల వివాదం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో ఆన్​లైన్​ టికెట్ల విషయంలో వివాదం జరిగింది. స్వామి వారికి అభిషేకం నిర్వహించేందుకు భక్తులు ఆన్​లైన్​లో బుక్​ చేసుకున్న టికెట్​ చెల్లదని నిలిపివేయగా ఆలయ సిబ్బందికి, భక్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

online ticket dispute at bhadradri seetharama swamy temple
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆన్​లైన్​ టికెట్​ వివాదం
author img

By

Published : Jan 12, 2020, 12:45 PM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆన్​లైన్​ టికెట్​ విషయంలో వివాదం చోటుచేసుకుంది. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు ప్రతి ఆదివారం పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఈ అభిషేకానికి ఒక్క జంటకు 1,100 రూపాయలు దేవస్థానం కేటాయించింది.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆన్​లైన్​ టికెట్​ వివాదం

హైదరాబాద్​కు చెందిన భక్తులు గత నెల 20న అభిషేకానికి ఆన్​లైన్​లో టికెట్​ బుక్ చేసుకున్నారు. ఈరోజు ఉదయం నాలుగు గంటలకు క్యూలైన్ వద్దకు వచ్చి దర్శనానికి వెళ్తుండగా ఆలయ సిబ్బంది ఆన్​లైన్ టికెట్లు చెల్లవని ఆపివేశారు.

గంటసేపు వేచి ఉన్న అనంతరం ప్రధాన ఆలయం లోనికి అనుమతించారు. వేలు ఖర్చు పెట్టి, నెల రోజుల ముందే టికెట్​ బుక్​ చేసుకుంటే ఆలయ అధికారులు అనుమతించలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

టికెట్లు నేరుగానే విక్రయిస్తున్నామని, ఆన్​లైన్​లో విక్రయించడం లేదని ఆలయ ఈవో నరసింహులు స్పష్టం చేశారు. భద్రాచల దేవస్థానానికి సంబంధించి టీ-యాప్​లో ఆన్​లైన్​ టికెట్లు విక్రయిస్తున్నారనే విషయం తమకు తెలియదని, దీనిపై విచారణ చేసి త్వరలో వివరాలు తెలుపుతామన్నారు.

Intro:భక్తులు

Body:హైదరాబాద్

Conclusion:టికెట్ల వివాదం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.