ETV Bharat / state

గుడిసెలు తొలగిస్తున్నారని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం

తమ గుడిసెలు అన్యాయంగా తొలగిస్తున్నారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రభుత్వ భూములను ఆక్రమించి గుడిసెలు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ అటవీశాఖ అధికారులు ఇళ్లను తొలగిస్తున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో జరిగింది.

suicide attempt
గుడిసెలు తొలగిస్తున్నారని మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Mar 20, 2021, 7:38 PM IST

తమ గుడిసెలను అన్యాయంగా తొలగిస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని రెండున్నర ఎకరాల ఫారెస్ట్ భూమి అంటూ అటవీశాఖ అధికారులు స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. అధికారుల తీరును వ్యతిరేకిస్తూ స్థానికులు ఆందోళన చేశారు.

కొత్తవాటిని మాత్రమే తొలగిస్తున్నాం:

ఆ భూమిలో గతంలో వేసుకున్న గుడిసెలు జోలికి పోకుండా కొత్తగా నిర్మించిన ఇళ్లను ఖాళీ చేయించే క్రమంలో ఈ వివాదం చెలరేగింది. ప్రభుత్వ స్థలంలో కొత్తగా పోల్స్ వేస్తుండగా వాటిని తొలగించే ప్రయత్నం జరిగినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఆక్రమణలు తొలగించే క్రమంలో ఆవేదనకు గురై ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితున్ని పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి: అనిశా వలకు చిక్కిన జూనియర్ అసిస్టెంట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.