భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియాలో ఇటీవల వంద సంవత్సరాలు బొగ్గు ఉత్పత్తి చేసి.. కాల పరిమితి తీరిన 21 ఇంక్లైన్ భూగర్భ గని యంత్ర సామాగ్రి, గ్యాస్ ఫైర్ సీల్ గోడలను సింగరేణి సేఫ్టీ కార్పోరేట్ జనరల్ మేనేజర్ ఎం.మల్లేష్ తనిఖీ చేశారు.
కాల పరిమితి ముగిసిన గనిలోని సామాగ్రి తగు జాగ్రత్తలతో తరలించాలని, ప్రస్తుతం పనులు జరుగుతున్న ఓపెన్ కాస్ట్లో జాగ్రత్తగా విధులు నిర్వర్తించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ తనిఖీలో ఇల్లందు ఏరియా మేనేజర్ సత్యనారాయణ, అధికారులు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, స్వామి సత్యనారాయణ, వీర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ కోసం మళ్లీ ప్లాస్మా దానం