భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో జరిగిన దేవి నవరాత్రుల పూజా కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
ఇల్లెందు సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవీశరన్నవరాత్రుల పూజలో ఏరియా జనరల్ మేనేజర్ పీవీ సత్యనారాయణ దంపతులు పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణికి చెందిన అధికారులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.