ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం... పూర్తి పర్యవేక్షణలో ఎన్నిక! - తెలంగాణ వార్తలు

ఆదివారం జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని 10 నియోజకవర్గాల్లో మొత్తం 1,29,851 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు.

mlc-elections-arrangements-in-khammam-district-by-collector
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం... పూర్తి పర్యవేక్షణలో ఎన్నిక!
author img

By

Published : Mar 13, 2021, 8:05 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​కు ఉమ్మడి ఖమ్మం జిల్లా సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్​కు అవసరమైన సామాగ్రి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరవేసిన అధికారులు.. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూర్తి పర్యవేక్షణలో ఎన్నిక జరుగుతుందని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.

mlc-elections-arrangements-in-khammam-district-by-collector
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం... పూర్తి పర్యవేక్షణలో ఎన్నిక!

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని 10 నియోజకవర్గాల్లో మొత్తం 1,29,851 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. వీరిలో ఖమ్మం జిల్లాలో 87,172 మంది ఉన్నట్లు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 42,679 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 71మంది అభ్యర్థులు బరిలో ఉండగా... వీరిలో 55 మంది స్వతంత్ర అభ్యర్థులున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

ఖమ్మంలో...

ఖమ్మం జిల్లాలో 127 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 30 మంది నోడల్ అధికారులు, 12 మంది సెక్టోరియల్, 22 మంది రూట్ అధికారులు, 153 మంది ప్రిసైడింగ్ అధికారులు, 153 సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 22 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 22 వీడియోగ్రఫీ బృందాలు, 308 మంది ఓపీవోలకు విధులు కేటాయించినట్లు వివరించారు. పోలింగ్ ప్రక్రియ పరిశీలన కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో గ్రఫీ నిర్వహించనున్నామని తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం...

భద్రాద్రి జిల్లాలో పోలింగ్ సజావుగా సాగేందుకు 9 రూట్లు, 9 మంది సెక్టోరియల్ అధికారులు, 16 మంది నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. పోలింగ్ విధుల కోసం 75 మంది పీవోలు, 75 మంది ఏపీవోలు, 150 మంది ఇతర పోలింగ్ అధికారులను నియమించామని అన్నారు.

ఇదీ చదవండి: ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల్లో శానిటైజేషన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.