భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖపై సమర శంఖారావానికి పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. శెట్టిపల్లికి తరలివెళ్తున్న పోడు రైతులు, గిరిజనులు, తెరాస కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించిన ఎస్సై శ్రీధర్ పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో అటవీ శాఖపై విమర్శలు చేశారు.
ప్రజలే లేనప్పుడు అధికారం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించిన ఆయన.. చలో శెట్టిపల్లికి పిలుపునిచ్చారు. ఆదివాసీలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు.
పలుమార్లు విమర్శలు
గత కొద్ది రోజుల ముందు కూడా అటవీశాఖపై రేగా విమర్శలు గుప్పించారు. కొందరు అధికారుల వల్లే అడవులు నాశనమవుతున్నాయని ఆరోపించారు. భూములు అధికారుల కబ్జాలో ఉంటే శిక్షకు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. తన వాదన తప్పయితే కేసులు పెట్టొచ్చని సవాల్ విసిరారు. తాజాగా అటవీశాఖ తీరుపై మరోసారి మండిపడ్డారు.
ఇదీ చదవండి: తొలి వ్యాక్సిన్ రాచకొండ సీపీ మహేశ్ భగవత్కే...