సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తోందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ చేశారు. ప్రతి మహిళ బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రతి ఏడాది ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కొవిడ్ సమయంలో కూడా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని గుర్తు చేశారు.
వ్యవసాయానికి పెద్ద పీట వేసి ప్రభుత్వం రైతుబంధు నగదు చెల్లించేందుకు రూ.7 వేల కోట్లు విడుదల చేసిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ పథకం చేరుతుందన్నారు. వ్యవసాయాన్ని నియంత్రించే పద్ధతిలో సాగు చేయాలని సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచన చేశారని కొనియాడారు. నియంత్రిత సాగు విధానంతో గ్రామాల్లో క్లస్టర్లు ఏర్పడ్డాయని, రైతు వేదికల నిర్మాణం జరుగుతోందన్నారు.
ఇవీ చూడండి: సమ్మక్క-సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి