ETV Bharat / state

గోదావరి ఉధ్దృతిపై మంత్రి అత్యవసర సమావేశం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం తాజా సమాచారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి వరద పరిస్థితిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. భద్రాచలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని గమనించారు. పునరావాసం పొందుతున్న బాధితులను అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు.

Ministerial ajay kumar emergency meeting on Godavari river flow
గోదావరి ఉధ్దృతిపై మంత్రి అత్యవసర సమావేశం
author img

By

Published : Aug 16, 2020, 6:31 PM IST

గోదావరి ఉధ్దృతిపై మంత్రి అత్యవసర సమావేశం

భద్రాచలంలోని సబ్​కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా అధికారులతో గోదావరి వరదలపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాసానికి తరలించాలని మంత్రి అన్నారు. ప్రథమంగా పునరావాసం ఏర్పాటు చేయడం తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు.

వరద పెరుగుతున్న వాగులు, రహదారుల్లో జన సంచారం లేకుండా చూడాలని ఆదేశించారు. అధికారులంతా ఆయా కేంద్రాల్లోనే ఉండి త్వరగా సమీక్షిస్తూ పునరావాసాలపై దృష్టి పెట్టాలన్నారు. విలీన మండలంలోని కూనవరం మండలంలోనే తాను జన్మించానని.. తన చిన్న నాడు ప్రతియేటా వరదల బారిన పడి పునరావాస కేంద్రాలకు వెళ్లేవాళ్లమని అప్పటి పరిస్థితులకు గుర్తుతెచ్చుకున్నారు.

ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉందని మంత్రి అన్నారు. జిల్లాలో పోలీసు, వైద్య అధికారులు, సీఆర్​పీఎఫ్ రెస్క్యూ టీంలు, ఇరిగేషన్ అధికారులు, అందరూ అందుబాటులో ఉండి పనులు వేగవంతంగా చేయాలని సూచించారు.

ఇదీ చూడండి : కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు మంత్రి కేటీఆర్ లేఖ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.