భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నికల్లో నియోజక వర్గంలోని అన్ని మండలాల నాయకులు వివిధ వర్గాలతో సమన్వయం చేస్తూ తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి సూచించారు. ఓటర్ల నమోదుపైనా దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా త్వరలో ఇల్లందు బస్ డిపో పనులను ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. ఇల్లందు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
అభ్యర్థి ఎవరనేది చూడకుండా ముఖ్యమంత్రి నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తీసుకోవాలని నాయకులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ, జిల్లా పరిషత్ ఛైర్మన్ వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజేందర్, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. 'మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు... అందరూ అప్రమత్తంగా ఉండండి'