భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మూడు ఆధార్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం ఒకటి మాత్రమే నడుస్తోంది. కరోనా నేపథ్యంలో పోస్టాఫీసులో, మరొకచోట సేవలు నిలిపివేశారు. పురపాలక సంఘ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న మీ-సేవా మాత్రమే సేవలందించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. సాధారణ సర్టిఫికెట్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఇక్కడకు రావడానికి అయిష్టత చూపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం ఈ సమస్యపై కన్నెత్తి చూడకపోవడం వల్ల వృద్ధులు, వికలాంగులు నానా అవస్థలు పడుతున్నారు.
కొత్త ఆధార్ నమోదు కంటే సవరణల సమస్య అధికంగా ఉంటుండడం.. ప్రస్తుతం ఉన్న కరోనా వ్యాధి సైతం వృద్ధాప్యంలో ఉన్న వారికి అధికంగా వస్తుండడటం వల్ల ఈ పరిస్థితి మరింత అయోమయంగా మారింది. పూర్తిగా వేలిముద్రలు, కంటితో నడిచే కేంద్రాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీనితో అందరూ ఆ ఒక్క కేంద్రం వద్దకే పోటెత్తడం జరుగుతుంది. అది కాస్త అప్పుడప్పుడు మొరాయిస్తే ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఎదురవుతోందని.. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ సమస్యకు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల