భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సారపాకలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న రాము, లతకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత రాత్రి కూడా పెద్ద గొడవ జరిగింది. ఇవాళ ఉదయం లత మృతి చెంది ఉంది. స్థానికులు బూర్గంపాడు పోలీసులకు సమాచారం అందించారు. లత ఆత్మహత్య చేసుకుందా.. రాము చంపాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు రామును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: ఊచలు లెక్కపెట్టాడు.. యువతిని అపహరించాడు