'మన ఇసుక వాహనం' అనే యాప్ ద్వారా ఇసుకను బుక్ చేసుకుంటే ప్రభుత్వ వాహనమే ఇసుకను తీసుకువెళ్తుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కుడుములపాడులో ఇసుక రీచ్‌ను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రారంభించారు. దీని ద్వారా ఎటువంటి అక్రమాలకు తావుండదని స్పష్టం చేశారు. ఈ యాప్‌ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
- ఇదీ చూడండి : దిశ హత్యాచార ఘటన మరవకముందే.. ఏపీలో మరొకటి...