భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడిగూడెం గ్రామంలో మిషన్ భగీరథ పనులు చేస్తుండగా వ్యక్తి మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన కొండయ్య పనులు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. మండలంలోని ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. కొండయ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: సాగర్ కాలువ ప్రమాదం: మృతదేహాల వెలికితీత