భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో లాక్డౌన్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నిత్యావసరాల కోసం జనం బయటకు వచ్చారు. అనంతరం దుకాణాలు మూసేశారు. ఈ క్రమంలో పట్టణ రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. మణుగూరు ఏఎస్పీ పి.శబరీష్, సీఐ భానుప్రకాశ్లు లాక్డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు.
నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుంటున్నారు. అనవసరంగా రోడ్లపై సంచరించే వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలని ఏఎస్పీ ఆదేశించారు.
ఇదీ చదవండి: అలా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.కోటి!