ETV Bharat / state

KTR Laid foundation Stones of Many Bridges : 'హైదరాబాద్​లో తొమ్మిదిన్నర ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కళ్ల ముందే ఉంది' - KTR laid foundation stones of many bridges

KTR Laid foundation Stones of Many Bridges : హైదరాబాద్‌లో బీఆర్ఎస్​ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కళ్లముందే కనిపిస్తుందని.. మళ్లీ ఎవ్వరి పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని.. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జంటనగరాల్లో మూసీ, ఈసీ నదులపై.. 7 వంతెనల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. బ్రిడ్జిల నిర్మాణంతో వరద ముంపు నుంచి రక్షణ సహా.. నగరం కొత్త అందాలు సంతరించుకుంటుందని కేటీఆర్‌ వెల్లడించారు.

Hyderabad
KTR
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 4:13 PM IST

Updated : Sep 25, 2023, 10:10 PM IST

KTR Laid foundation Stones of Many Bridges in Hyderabad : హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్‌ లోపల.. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరచాలన్న లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం మూసీ, ఈసీ నదులపై పలు వంతెనలను ప్రతిపాదించింది. అందులో భాగంగా మూసీ, ఈసీ నదులపై 7 వంతెనలకు.. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ (KTR ) శంకుస్థాపనలు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం ఫతుళ్లగూడ నుంచి ఉప్పల్ పరిధి ఫీర్జాదిగూడ వరకు.. నూతన బ్రిడ్జి నిర్మాణానికి.. రూ.52 కోట్లతో 200 మీటర్ల పొడవైన వంతెనకు.. ఆయన శంకుస్థాపన చేశారు.

KTR at Mega Property Show in Hyderabad : 'నగరాభివృద్ధికి ఇది కేవలం ట్రైలర్​ మాత్రమే.. ముందుంది అసలు సినిమా'

ఈ క్రమంలోనే రూ.42 కోట్లతో ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌ వద్ద.. రూ.35 కోట్లతో ప్రతాపసింగారం-గౌరెల్లి వద్ద.. రూ.39 కోట్లతో మంచిరేవుల వద్ద.. వంతెనల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈసీ నదిపై రూ.32 కోట్లతో బుద్వేల్‌ ఐటీ పార్క్-2 సమీపంలో.. రూ.20 కోట్లతో బుద్వేల్‌ ఐటీ పార్క్‌-1 వద్ద వంతెనలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపనలు చేశారు. గత ప్రభుత్వాలు పట్టించుకోక మూసీ నది.. మురికి కూపంగా మారిపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు.

New Bridges in Hyderabad : మూసీని పైనుంచి కింది వరకు.. మంచిరేవుల నుంచి కింద ఘట్​కేసర్ వరకు.. సుందరీకరించాలన్న ముఖ్యమంత్రి కలను నెరవేరుస్తామని కేటీఆర్ తెలిపారు. కరోనా రావడం వల్ల సరైన సమయంలో చేయలేకపోయినా.. అద్భుతమైన బ్రిడ్జిలు కడతామని పేర్కొన్నారు. అనంతరం ముసారాంబాగ్ వద్ద రూ.152 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 2020లో వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు.

KTR at Chicago Food Stop : 'తెలంగాణ ఫుడ్​స్టాప్' తెస్తాం.. షికాగోలో 'ఆహారంలో సృజనాత్మకత'పై ప్రసంగంలో కేటీఆర్

కరోనా కారణంగా కొన్ని పనులను చేయలేకపోయామని కేటీఆర్ తెలిపారు.ఇప్పుడు అన్ని వంతెనలు పూర్తి చేస్తున్నామని వివరించారు. 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేయాలని ఎస్టీపీలను నిర్మిస్తున్నామని చెప్పారు. దుర్గంచెరువుపై నిర్మించిన వంతెన కంటే.. అందమైన వంతెనలను నిర్మిస్తామని పేర్కొన్నారు. గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతామని స్పష్టం చేశారు. తొమ్మిది సంవత్సరాలలో ఎంతో అభివృద్ధిని సాధించామని కేటీఆర్ వెల్లడించారు.

Double Bedroom Houses Distribution : ఇప్పటికే 30,000 డబుల్ బెడ్ రూం ఇండ్లను (Double Bedroom Houses)పంపిణీ చేసుకున్నామని.. త్వరలోనే మరో 40,000ల ఇళ్లను పంపిణీ చేస్తామని కేటీఆర్ తెలియజేశారు. అనంతరం దుర్గం చెరువు వద్ద ఎస్టీపీని.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించారు. దుర్గంచెరువు వద్ద మ్యూజికల్ ఫౌంటెన్‌కు శ్రీకారం చుట్టారు.

"మూసీ, ఈసీ నదులపై రూ.545 కోట్లతో 14 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేసుకుంటున్నాం. 2020లో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్​లో చాలా ఇబ్బందులు వచ్చాయి. కరోనా కారణంగా కొన్ని పనులను చేయలేకపోయాం. 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేయాలని ఎస్టీపీలను నిర్మిస్తున్నాం." - కేటీఆర్​, పురపాలక శాఖ మంత్రి

KTR Laid foundation Stones of Many Bridges త్వరలోనే మరో 40 వెేల డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ

Second Phase Double Bedroom Houses Distribution : జాతరగా రెండో విడత ఇళ్ల పంపిణీ.. కల నెరవేరిన వేళ లబ్ధిదారుల ఆనందం డబుల్

KTR Laid Foundation Eurofins Campus : 'ఉపాధి, ఉద్యోగ కల్పన, సంపదను సృష్టించటమే నేతల ముందున్న సవాల్‌'

Last Updated : Sep 25, 2023, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.