భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రమాదం జరిగింది. రాత్రి వేళ విధులు నిర్వహిస్తున్న జేసీబీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి సమీపంలోని బైకుషాపులోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో అక్కడున్న కొన్ని ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.
జేసీబీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. యంత్రాలతో పనులు జరిగేటప్పుడు నైపుణ్యం గల వారిని నియమించాలని అన్నారు. అధికారుల పర్యవేక్షణలో పనులు జరగాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: కరోనాపై ప్రముఖుల ప్రచారం