భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏజిహెచ్ఎస్ వార్డెన్ పూలన్ దేవిని సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మెనూ ప్రకారం తమకు భోజనం పెట్టడం లేదని విద్యార్థినిలు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. దీనికి విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు. వారు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ అంశంపై భద్రాచలం ఐటీడీఎ డీడీ రమాదేవి స్పందించారు. విద్యార్థినిలకు సరైన భోజన సదుపాయం ఏర్పాటు చేయడంలో వార్డెన్ అలసత్వం వహిస్తోందని గుర్తించారు. దీంతో వార్డెన్ పూలన్ దేవిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదీ చదవండి: సరైన పరిహారం ఇస్తేనే భూములిస్తాం.. జెన్కో రైల్వే లైన్‌పై రైతుల ఆందోళన