భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇల్లందు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కొవాగ్జిన్ టీకాలు ఇస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించిన వారికి మాత్రమే వైద్యాధికారులు టీకాలు ఇస్తున్నారు.
అర్హులందరికీ వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నట్టు వైద్యుడు డాక్టర్ వరుణ్ తెలిపారు. కరోనా టీకా కోసం వచ్చే వారు కచ్చితంగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని వైద్యాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా