భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. జేకే కాలనీ, 24 ఏరియా సివిల్ విభాగం, నీటి సరఫరా సులభ్ ఏరియా పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు అందజేశారు. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికుల పట్ల సానుభూతితో వ్యవహరించట్లేదని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
సింగరేణిలో అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాభాల వాటాలో వివక్షత చూపకుండా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇవ్వాలన్నారు. మాస్కుల పంపిణీ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి సారంగపాణి, బ్రాంచ్ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు