భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీసీ బాలికల వసతి గృహ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థినులు రహదారిపై ధర్నా నిర్వహించారు. వసతి గృహానికి నూతన భవనం నిర్మించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అనంతరం విద్యార్థులకు న్యాయం జరిగేలా అధికారులతో మాట్లాడతానని పోలీసులు హామీ ఇచ్చి నిరసన విరమింపచేశారు.
ఇవీ చూడండి : తెలంగాణ సాయుధ పోరాటం తొలి ఎన్కౌంటర్ ఇక్కడే...!