ETV Bharat / state

Humanity: ముస్లిం వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించిన హిందువులు - భద్రాచలం వార్తలు

కరోనా రక్తసంబంధాన్ని సైతం దూరం చేస్తున్న సమయంలో మేమున్నామంటూ కొందరు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇంటి పెద్ద మహమ్మారి చేతిలో చనిపోతే... మగదిక్కు లేని ఓ కుటుంబం ఆయన అంత్యక్రియలు నిర్వహించలేక ఓ ట్రస్టు సభ్యులను ఆశ్రయించింది. వారి విజ్ఞప్తి మేరకు ట్రస్ట్​ నిర్వాహకులు అంత్యక్రియలు(funeral) నిర్వహించి అందరి అభినందనలు అందుకుంటున్నారు. ఈ ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది.

hindus-conducted-a-funeral-for-a-muslim-man-who-died-with-corona-at-bhadrachalam
Humanity: ముస్లిం వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించిన హిందువులు
author img

By

Published : Jun 17, 2021, 6:02 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Bhadrachalam)లో జగదీష్ కాలనీకి చెందిన అసన్​ మహమ్మద్​ నివాసముంటున్నారు. అసన్​కు ఇద్దరు కుమార్తెలున్నారు. ఇటీవల మహమ్మద్​ కరోనా బారిన పడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన కొవిడ్​(Covid-19)తో మృతిచెందారు.

అసన్​కు అంత్యక్రియలు చేసేందుకు బంధువులు ముందుకు రాలేదు. కుమారులు కూడా లేకపోవడంతో.. కుటుంబసభ్యులు సీపీఎం పట్టణ కమిటీ నిర్వహిస్తున్న బీసీఆర్​ ట్రస్టు సభ్యుల(BCR Trust Members)కు సమాచారం అందించారు. వారి విజ్ఞప్తి మేరకు ట్రస్ట్​ సభ్యులు అంత్యక్రియలు(Funeral) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్​ నిర్వాహకులు, సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, కార్యదర్శి వర్గసభ్యులు భీమవరపు వెంకటరెడ్డి, నకిరికంటి నాగరాజు, లాయర్ పామరాజు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అసన్ కుటుంబ సభ్యులు బీసీఆర్​ ట్రస్ట్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చూడండి: Inspiration : ప్రాణంపోయే స్థితిలోనూ... ప్రాణావాయువును అందిస్తోన్న మాతృమూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.