భద్రాచలంలో గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. రెండు రోజుల క్రితం 61.7 అడుగుల వద్ద ఉన్న గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గుతూ నిన్న మధ్యాహ్నానికి 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఈరోజు ఉదయం గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరగా... రెండో ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించుకున్నారు.
ఈరోజు సాయంత్రం గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరింది. భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 43 అడుగులకు తగ్గితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకోనున్నారు. గోదావరి నీటిమట్టం తగ్గుతున్నప్పటికీ... ఏజెన్సీ మండలాలకు ఇంకా రాకపోకలు పునరుద్ధరింపబడలేదు. చాలా రహదారుల పైన ఒండ్రు మట్టి, కర్రలు నిలిచి ఉన్నాయి. మరికొన్ని చోట్ల వరద నీరు రహదారి పైనే ఉంది.