ETV Bharat / state

స్వల్పంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

author img

By

Published : Jul 27, 2019, 10:47 PM IST

గోదావరి నదిలో నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈరోజు వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 12 అడుగులకు చేరింది.

స్వల్పంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి వరద నీరు మెల్లగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు చర్ల మండలంలో ఉన్న తాలిపేరు జలాశయం నుంచి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. ఈ రోజు ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 12 అడుగులకు చేరింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నందున దిగువ ప్రాంతమైన భద్రాచలంలో వరద నీరు పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని చర్ల మండలంలో ఉన్న తాలిపేరు జలాశయానికి ఎగువ ప్రాంతమైన ఛత్తీస్​గఢ్ నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు జలాశయంలో 13 గేట్లను వదిలి 17 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ ప్రాంతమైన గోదావరిలోకి వదులుతున్నారు.

ఇవీచూడండి: కేసీఆర్‌కు ఒడిశా సీఎం లేఖ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.