భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు జలాశయం నుంచి నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న ఛత్తీసగఢ్ నుంచి భారీగా వరద నీరు రావడం వల్ల జలాశయం 19 గేట్లు ఎత్తి 64 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు.
భద్రాచలం వద్ద గురువారం రాత్రి 35.8 అడుగులు ఉన్న నీటిమట్టం ఇవాళ ఉదయం 35.2 అడుగుల వద్ద నిలకడగా కొనసాగుతోంది. ఎగువన ఉన్న పేరూరులో ప్రస్తుతం నది నీటిమట్టం పెరుగుతున్నందున భద్రాచలంలోనూ నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఇదీ చూడండి: ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ఎంపికకు కారణాలేంటి?