భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన మోటార్ మెకానిక్ సమీ ఉల్లా... రైతుల కోసం ఏదో ఒకటి చేయాలని పరి తపించాడు. పెట్రోల్, కిరోసిన్ కొరత కారణంగా గ్యాస్‌తో నడిచే వ్యవసాయ ఇంజిన్‌ను రూపొందించాడు. పెట్రోల్, కిరోసిన్‌తో పోలిస్తే తక్కువ ఖర్చు ఉన్న గ్యాస్‌తో రైతులు ఈ మోటార్ వాడుకోవచ్చని సమీ ఉల్లా తెలిపారు.
గతంలో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు తన ప్రయోగాన్ని పరిశీలించాల్సిందిగా కోరినా.. అధికారుల నుంచి స్పందన రాలేదని సమీ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చేసిన ప్రయోగాన్ని పరిశీలించి రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే నెల 19 నుంచి జరిగే ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో అన్ని కళాశాలలు, యూనివర్సిటీల అవగాహన కార్యక్రమాలైన ఇన్నోవేషన్ యాత్రలో తనకు అవకాశం కల్పించాలని సమీ విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:'కరోనా'కు మందు కనుగొన్న తమిళ వైద్యుడు!