భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మీదుగా రవాణా చేస్తున్న రెండు క్వింటాళ్ల 80 కేజీల గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. పక్కనే ఉన్న చత్తీస్ఘడ్ రాష్ట్రం నుంచి భద్రాచలం మీదుగా గంజాయి రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా వాహనం అనుమానాస్పదంగా వస్తుందన్న సమాచారం మేరకు పోలీసులు గస్తీ చేపట్టారు. వీరిని గమనించిన నిందితులు వాహనాన్ని ఆపకుండా వెళ్లడం వల్ల పోలీసులు వెంబడించారు. బ్రిడ్జి సెంటర్ దగ్గర నిందితులు వాహనాన్ని వదిలిపెట్టి పారిపోయారు. కారులో గంజాయిని పోలీస్ స్టేషన్కు తరలించారు. గంజాయి విలువ 43 లక్షలు ఉంటుందని భద్రాచలం సీఐ వినోద్ రెడ్డి తెలిపారు. పారిపోయిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. 19 మందికి గాయాలు