ETV Bharat / state

militia team surrenders: వేధింపులు తాళలేకే మావోయిస్టులకు సాయం చేశాం: మిలీషియా సభ్యులు - maoist militia members surrendered at bhadradri police

భద్రాద్రి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 14మంది మావోయిస్టు మిలీషియా(Maoist militia members) సభ్యులు లొంగిపోయారు. వీరంతా చర్ల మండలానికి చెందిన వారని ఎస్పీ సునీల్​ దత్​ తెలిపారు. లొంగిపోయిన వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Maoist militia
మావోయిస్టు మిలీషియా సభ్యులు
author img

By

Published : Sep 23, 2021, 5:12 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు(Maoist militia members) లొంగిపోయారు. వీరంతా నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన వారని ఎస్పీ సునీల్​ దత్​ వెల్లడించారు. లొంగిపోయిన వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.

చర్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన మిలీషియా సభ్యులను.. సమావేశాలకు హాజరు కావాలని, నిత్యావసర వస్తువులు అందించాలని మావోయుస్టులు డిమాండ్​ చేస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. వారి వేధింపులు తాళలేకనే తప్పనిసరి పరిస్థితుల్లో మావోయిస్టులకు సహాయం చేశారని వివరించారు. అందుకే ప్రశాంత జీవనాన్ని కొనసాగించేందుకు వీరంతా లొంగిపోయారని పేర్కొన్నారు.

మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పార్టీ సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. స్థానిక పోలీస్​ స్టేషన్​లో లొంగిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన సభ్యులకు రక్షణ కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: Camera in Bathroom case: బాత్​రూమ్​లో కెమెరా కేసు.. మ్యాటర్ సెటిల్​ చేస్తానంటూ మధ్యవర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.