ETV Bharat / state

గోదావరికి తగ్గిన వరద, కృష్ణాలోకి పోటెత్తుతున్న ప్రవాహం - జూరాల ప్రాజెక్టు

Godavari Water Level Today ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా, గోదావరిల్లోకి వరద ప్రవాహం పోటెత్తుతోంది. అయితే నిన్నటి కంటే గోదావరి వద్ద నీటిమట్టం స్వల్పంగా తగ్గిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 53 అడుగుల వద్ద ప్రవహిస్తోందని చెప్పారు. మరోవైపు జూరాలకు మాత్రం వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోందని అన్నారు.

Godavari Water Level Today
Godavari Water Level Today
author img

By

Published : Aug 18, 2022, 12:13 PM IST

Updated : Aug 18, 2022, 12:32 PM IST

గోదావరికి తగ్గిన వరద

Godavari Water Level Today: భద్రాచలం వద్ద ఉద్ధృతంగా పెరిగి 54 అడుగులు దాటి ప్రవహించిన నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 53.3 అడుగుల వద్ద ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. గతంలో కంటే నీటిమట్టం పెరగడంతో.. భద్రాచలం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రహదారులపైకి వరద నీరు చేరడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వారం రోజులుగా ముంపు మండలాలు జలదిగ్బంధంలోనే చిక్కుకొనే ఉన్నాయి. కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యవసరాలు లభించక సుమారు 200 పైగా గ్రామాలప్రజలు ఇబ్బందిపడుతున్నారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.

jurala project inflow today: ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా పరివాహక ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. జూరాల జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.35 లక్షల క్యూసెక్కులు ఉండగా 2.40 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.690గా ఉందని అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. సాగర్‌లోకి లక్ష 17 క్యూసెక్కులు వస్తుండంగా అంతేమొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు . సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత 584.80 అడుగులు ఉందని అధికారులు తెలిపారు.

Last Updated : Aug 18, 2022, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.