భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రుల స్వామివారికి ఓ భక్తురాలు బంగారు కానుక సమర్పించారు. స్వామివారికి దాదాపు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను బహుకరించారు. బెంగళూరుకు చెందిన వాణీ గుప్తా స్వామివారి కోసం వీటిని ప్రత్యేకంగా తయారు చేయించారు.
ఈ రోజు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ఆలయ అధికారులకు వాటిని అందించారు. వీటిలో 2 బంగారు కడియాలు, బంగారు, ముత్యాల హారాలు ఉన్నాయి. రామయ్యకు తమ మొక్కును చెల్లించినట్లు వాణి గుప్తా తెలిపారు.