ETV Bharat / state

చేపలవేటకై పన్నిన వలలు దగ్ధం చేయించిన మున్సిపల్​ ఛైర్మన్​ - latest news of bhadradri kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుల పాడుచెరువులో నిషేధం ఉన్నా.. చేపల వేటకై వేసిన వలలను తీయించి మునిసిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు దగ్ధం చేయించారు. నిబంధనలు ఉల్లంఘించిన మత్స్యకారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Fish traps burned in bhadradri kothagudem
చేపలవేటకై పన్నిన వలలు... దగ్ధం చేయించిన మున్సిపల్​ ఛైర్మన్​
author img

By

Published : Jul 13, 2020, 12:07 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపల్ పరిధిలోని ఇల్లెందుల పాడు చెరువులో కొంతకాలంగా మత్య్సకారులు అక్రమంగా రాత్రివేళలో చేపలు పట్టేందుకు వలను ఏర్పాటు చేస్తున్నారు. వారిపై మున్సిపల్ సిబ్బంది, తెరాస యువజన సంఘం నాయకులు నిఘా పెట్టారు.

ఆదివారం ఉదయం చెరువులో వేసిన వలలను గుర్తించి వాటిని బయటకు తీయించి మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు దగ్ధం చేయించారు. ఇల్లెందుల పాడు చెరువులో చేపలవేట నిషేధమని.. దానిని ఉల్లంఘించి చేపలు పట్టే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి: హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.