భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం వద్ద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ధాన్యం పరదాలు కుట్టే చిన్నపరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడి, పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 10 ఇళ్లు దగ్ధమైనట్లు గుర్తించారు. అగ్నిప్రమాదం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.
ఇదీ చదవండి: 12 రాష్ట్రాల్లోనే 92 శాతం 'వైరస్' కేసులు