Female Head Constable Died after Falling into Nala in Bhadrachalam : భద్రత కోసం వచ్చి.. ప్రాణాలు కోల్పోయి.. భద్రాచలంలో నాలాలో పడి మహిళా హెడ్‌కానిస్టేబుల్ మృతి - నాలాలో పడి మరణించిన మహిళా కానిస్టేబుల్
Female Head Constable Died after Falling into Nala in Bhadrachalam : భద్రాచలంలో కురిసిన భారీ వర్షం.. ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రాణం తీసింది. భద్రాద్రి రామయ్య సన్నిధి ఎదురుగా ఉన్న అన్నదాన సత్రం వద్ద మురుగు కాల్వలో పడి శ్రీదేవి అనే హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.
Published : Sep 30, 2023, 5:23 PM IST
|Updated : Sep 30, 2023, 10:50 PM IST
Female Head Constable Died after Falling into Nala in Bhadrachalam : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గత రెండు రోజులుగా జరుగుతోన్న గణేశ్ నిమజ్జనాలతో అక్కడ రద్దీ వాతావరణం నెలకొంది. కాగా నేడు మంత్రి కేటీఆర్(Minister KTR) పర్యటనతో భద్రతారీత్యా అక్కడ ఎక్కువ మంది పోలీసులు మోహరించారు. దీంతో కొత్తగూడెంలో పని చేస్తున్న శ్రీదేవి అనే హెడ్ కానిస్టేబుల్.. డ్యూటీ నిమిత్తం భద్రాచలం వచ్చారు. డ్యూటీ అనంతరం భద్రాద్రి రామయ్య సన్నిధికి వెళ్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని అన్నదాన సత్రంలో భోజనం చేసేందుకు అన్నదాన సత్రం వద్దకు వెళ్లారు.
ఈ క్రమంలోనే అన్నదాన సత్రం ఎదురుగా ఉన్న కాలువలో పడిపోయారు. ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా కాలువ నిండా నీళ్లు ఉండటంతో కాలువలో కొట్టుకుపోయారు. కొద్ది దూరం తర్వాత గోదావరి కలకత్తా స్లోయిజ్ల వద్ద మృతదేహం లభ్యమైంది. భద్రాచలంలో గత రెండు రోజులుగా జరుగుతున్న గణపతి నిమజ్జనాలు(Ganesh Nimajjanam 2023), ఈరోజు జరగనున్న కేటీఆర్ పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించేందుకు భద్రాచలం వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీదేవి మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Hyderabad Boy Nala death Case Update : బాచుపల్లి నాలాలో బాలుడు మృతి కేసు.. వారి నిర్లక్ష్యమే కారణం
A Man Died nimajjanam in Siddipet District : మరోవైవు వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో పడి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు కుమ్మరి కుంట చెరువులో గల్లి గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనానికి వెళ్లడాని తెలిపారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో శ్రీకాంత్ మృతదేహాన్ని వెలికి తీశారు. శ్రీకాంత్‌కు భార్య వనజతో పాటు సంవత్సరం కొడుకు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
Woman Dies After Falling into Nala in Secunderabad : ఇటీవలే సికింద్రాబాద్‌లోని మెట్టుగూడ దూద్‌బావి వద్ద జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న మహిళా నాలాలో పడి కొట్టుకుపోయింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా బ్రిడ్జి కింద నుంచి వెళ్లే ప్రయత్నంలో ఆమె ఒక్కసారిగా నాలాలో పడిపోయింది. నాలా ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అందులో కొట్టుకుపోయింది. అయితే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నాలాలో గాలించిన పోలీసులకు చివరకు అంబర్‌నగర్ వద్ద విగతజీవిగా తేలి కనిపించింది.
Girl falls in nala: పాల ప్యాకెట్ కోసం వెళ్తుండగా.. నాలాలో పడి చిన్నారి మృతి.. సీసీ టీవీలో దృశ్యాలు
Woman Dies into Nala in Secunderabad : స్థానికులు ఆమెను బ్రిడ్జి కింద నుంచి వెళ్లవద్దని వారించినప్పటికీ ఆమె వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నాలాలో పడిన వెంటనే స్థానికులు పారిశుద్ధ్య కార్మికురాలిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ.. నాలా ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో ఎలాంటి ప్రయోజనం లేకపోయిందన్నారు. మెట్టుగూడ వద్ద గల నాలా నుంచి సుమారు మూడు కిలోమీటర్ల పాటు కొట్టుకుపోయి వారాసిగూడలోని అంబర్‌నగర్ వద్ద మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాన్ని నాలా నుంచి బయటకు వెలికి తీశారు. ముఖంపై బలమైన దెబ్బలు ఉన్నాయి. ఈ దెబ్బలు నాలాలో కొట్టుకుపోయినప్పుడు ఏదైనా గట్టిగా తగిలి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Hyderabad Woman Missing in Nala : హైదరాబాద్ గాంధీనగర్‌లో గల్లంతైన మహిళ కోసం కొనసాగుతున్న గాలింపు