భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని గిరిజన భవన్లో పంపిణీ చేసే ఎరువుల కోసం పలు గ్రామాల నుంచి రైతులు వచ్చి నాలుగు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఉదయం 7 గంటల నుంచి ఒక వైపు వర్షం పడుతున్నా రైతులకు ఎరువుల పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఇదేంటని అడిగితే రోజూ పంపిణీ చేస్తున్న గుమస్తా రాని కారణంగా గత మూడు రోజులుగా వస్తోన్న వారిని గుర్తించలేకపోయాను అని.. రైతులు కూడా ఒకేసారి రావడం వల్ల పంపిణీ చేయలేకపోతున్నానని ఓ అధికారి నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి సతీష్ సొసైటీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా సాయంత్రం నాలుగు గంటల నుంచి పంపిణీ ఏర్పాట్లు చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని మండలంలోని రైతులకు సరిపడా ఎరువులు ఉన్నాయని ఎటువంటి కొరత రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి : కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ