ETV Bharat / state

కళాశాలల్లో ప్రవేశాల కోసం పాట్లు - భద్రాద్రి కొత్తగూడెం

ఊహించని బహుమతులు.. అవి అవసరం లేదంటే కోరుకున్న పరికరాలు.. అంతకు మించి మొండికేస్తే ల్యాప్‌టాప్‌లతో లాలింపులు.. ఇవేమీ వద్దంటే రూ.వేలల్లో నజరానాలు..ఇవన్నీ.. ఇంజినీరింగ్ విద్యనభ్యసించాలనుకొనే విద్యార్థులకు కొన్ని ప్రైవేటు కళాశాలలు ఇస్తున్న తాయిలాలు. తమ కళాశాలల్లో సీట్లను భర్తీచేసుకోవడమే లక్ష్యంగా యాజమాన్యాలు ప్రలోభాల పర్వానికి తెరలేపాయి.

engineering college admissions
author img

By

Published : Jul 2, 2019, 9:56 PM IST

పుట్టగొడుగుల్లా ఇంజినీరింగ్‌ కళాశాలలు పుట్టుకురావడం.. తర్వాత ఈ విద్యకు డిమాండ్‌ తగ్గిపోవడంతో ఏటేటా భారీ సంఖ్యలో ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. గత కొన్నేళ్లుగా పలు కళాశాలలు మూసివేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ ప్రభావం పూర్వ ఖమ్మం జిల్లాలోనూ పడింది. ప్రస్తుతం నడుస్తున్న యంత్ర విద్య కళాశాలల్లోనూ కొన్నింటిలో వందల సంఖ్యల్లోనే సీట్లు మిగిలిపోతుండడంతో వాటిని భర్తీ చేసుకొనేందుకు యాజమాన్యాలు నానా అవస్థలు పడుతోంది. ఈ క్రమంలోనే విద్యార్థులను ప్రలోభపెట్టే సంస్కృతికి కొన్ని కళాశాలలు శ్రీకారం చుట్టాయి. పూర్వ ఖమ్మం జిల్లా పరిధిలో గత కొన్నేళ్లుగా ఈ విధానం కొనసాగుతోంది.ఈ ఏడాది జరిగిన ఎంసెట్‌కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు ఆరు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో సుమారునాలుగు వేల మంది అర్హత సాధించారు. వారిలో ఎక్కువ మందిని తమ కళాశాలల్లో చేర్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్స్‌ కోసం విద్యార్థులపై వల్లమాలిన ప్రేమను కురిపిస్తున్నారు.

ఆ విద్యార్థులే లక్ష్యంగా...

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేర్పించుకునేందుకు యాజమాన్యాలు దళిత, గిరిజన విద్యార్థులను లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. ఉపకార వేతనాలతోపాటు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు వారిపై దృష్టి సారిస్తున్నారు. విద్యార్థులు కళాశాలలో చేరితే ఫీజులు చెల్లించే అవసరం లేదంటూ ఎదురు పెట్టుబడి పెడుతున్నారు. నాలుగేళ్ల వరకు కొనసాగాల్సిన విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు కళాశాలలో కొనసాగే ఫీజుల మేరకు(ఎంత ఫీజు ఉంటుందో అంత) రీయంబర్స్‌మెంట్‌ ఏటా అందుతుంది. అయితే వాటిని మాత్రం విద్యార్థులకు చెల్లించే పరిస్థితులుండవు. పైగా కొంతమంది విద్యార్థులకు వస్తున్న ఉపకార వేతనాలు కూడా కొన్ని కళాశాలలు చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి. విద్యార్థుల ఖాతాల్లో జమవుతున్న ఉపకార వేతనాల్లో సగం మొత్తాన్ని కొన్ని కళాశాలలు వసూలు చేస్తున్నాయి. ఇలా ఒక్కో కళాశాలలో ఓ విధమైన విధానాలు చెల్లుబాటవుతున్నాయి. ఇంజినీరింగ్‌ సీటుపై వచ్చే రీయంబర్స్‌మెంట్‌ను ఆదాయంగా మార్చుకోడానికి విద్యార్థులను పావుల్లా వాడుతున్నారు. వారికున్న పరిస్థితుల దృష్ట్యా తల్లిదండ్రులు ఇతర విషయాలు ఆలోచించే పరిస్థితులు లేకుండా మభ్యపెడుతున్నారు.

ధ్రువీకరణ పత్రాల జారీలోనూ లోపాలు...

ఇంజినీరింగ్‌ కోర్సుల్లో మొదటి సంవత్సరం తర్వాత విద్యను ఆపాల్సి వచ్చిందంటే ఆ విద్యార్థులు మిగతా మూడేళ్ల ఫీజులు (కళాశాలల్లో అమలవుతున్న ఫీజులు) చెల్లించక తప్పదు. నాణ్యమైన విద్యా విధానాన్ని కొనసాగించాలని, అదే స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇటీవల కొన్ని నిబంధనలు తెరపైకి వచ్చాయి. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో డిటైండ్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల క్రెడిట్స్‌ మొదటి సంవత్సరంలో సంతృప్తికరంగా లేకపోతే అదే సంవత్సరంలో వారు చదువుతున్న విభాగానికి స్వస్తి పలకాలి. ఇలాంటి పరిస్థితుల్లో వేరొక ప్రత్యామ్నాయ విద్యను ఆశ్రయించే పరిస్థితులు విద్యార్థులకు లేకుండాపోతున్నాయి. కళాశాలలో చేరిన మొదటి సంవత్సరంలోనే వారికి సంబంధించిన అసలు ధ్రువీకరణ పత్రాలను అందజేయాల్సి వస్తోంది. తిరిగి వాటిని పొందాలంటే మాత్రం మిగిలిన మూడేళ్ల ఫీజును చెల్లించాలంటూ యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. విధి లేని పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు ఆర్థికంగా నష్టపోతున్నారు.

ఇంటర్‌ కళాశాలలతో ఒప్పందాలు...
ఇంజినీరింగు కళాశాలల్లో విద్యార్థులను చేర్పించుకోడానికి ఇంటర్మీడియట్‌ కళాశాలలతో ఆర్థిక ఒప్పందాలు కొనసాగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటర్‌ విద్యార్థులను ఒప్పించి యంత్ర విద్య కళాశాలలకు పంపించే ప్రక్రియలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. భద్రాద్రి జిల్లాలోని మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెంలోని కొన్ని ప్రైవేటు కళాశాలలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయనే ప్రచారం సాగుతోంది. ఇంటర్‌ ధ్రువీకరణ పత్రాలు సైతం కొన్ని కళాశాలల నుంచి నేరుగా ఇంజినీరింగు కళాశాలలకు చేరుతుండటం గమనార్హం. ఈ ప్రక్రియలో కొందరు ట్యూటర్లు, వార్డెన్లు, అధ్యాపకులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. వారికి సైతం కమీషన్ల పర్వం కొనసాగుతోంది. ఇలాంటి పరిణామాల్లో ఇంజినీరింగ్‌ కౌన్సిల్‌ కేంద్రాల వద్ద కార్లలోనే కూర్చొబెట్టి యాజమాన్యాల సిబ్బంది విద్యార్థులతో మంతనాలు సాగిస్తున్నారు.

ఇవీ చూడండి:ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.