భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నడవలేని భక్తులు, వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ పని చేయడం లేదు. దూర ప్రాంతాల నుంచి రామయ్య దర్శనం కోసం వస్తున్న వృద్ధులు, వికలాంగులు నడవలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. అలా వచ్చిన వృద్ధులను సైకిళ్లతో సహా మెట్లపై మోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
గత రెండు రోజుల నుంచి లిఫ్ట్ బాగు చేయక పోవడం వల్ల భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆలయ అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని లిఫ్ట్ బాగుచేయించాలని భక్తులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : గురుకులాల్లో అరాచకాలు.. తల్లిదండ్రులకు గర్భశోకం