ETV Bharat / state

సంధ్య.. ఎంతోమంది గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపుతోంది! - తెలంగాణ వార్తలు

ఉన్నత విద్య అభ్యసించినా.... ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక కొందరిలో జవాబుదారి అసలే కనిపించదు. ఇంకా సమయపాలన గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. ఇక కొందరు వైద్యులైతే ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు. కానీ ఈమె అందుకు భిన్నం. ధన్వంతరి వారసులం.. ధరణిలో దేవతలమన్న నానుడికి నిలువెత్తు నిదర్శనం ఈ వైద్యురాలు. గిరిపుత్రులకు వైద్యం అందించేందుకు ఎళ్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఆమే ఆళ్లపల్లి మండల ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ సంధ్యారాణి.

doctor sandhya rani medical services, allapalli doctor sandhyarani
ఆళ్లపల్లి వైద్యురాలు సంధ్యారాణి విశిష్ట సేవలు, వాగు దాటుతున్న వైద్యురాలు సంధ్యారాణి
author img

By

Published : Jul 21, 2021, 2:17 PM IST

ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామందికి విధుల పట్ల పెద్దగా పట్టింపు ఉండదు. ఏ చిన్న కారణం దొరికినా ఏం చక్కా సెలవు పెట్టి.... విధులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించే వారు చాలా మందే ఉంటారు. పైగా సమయపాలన గురించి వారిని ప్రశ్నించే నాథుడే ఉండరు. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు ఏసీ కార్లలో వారికి నచ్చిన సమయానికి ఆస్పత్రికి వస్తారు. తీరా వచ్చాక ఓవైపు ప్రాణాలు పోతున్నా పట్టించుకోరు. పైగా రోగుల పట్ల ఎంతో చిన్నచూపుతో వ్యవహరిస్తారు. కానీ ఈ వైద్యురాలు మాత్రం అందుకు భిన్నం. గిరిపుత్రుల పాలిట దేవతగా నిలుస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల వైద్యురాలు సంధ్యారాణి.

వాగులు, వంకలు దాటి..

అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవ చేయడమే పరమావధిగా తలిచారు ఆమె. అందుకే ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా సేవలందించడానికి వెళ్తుంటారు. ఓ వైపు వర్షం.. మరోవైపు పొంగుతున్న వాగు.. ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లడానికి కనీసం రోడ్డు లేదు. సహజంగా వైద్యులు కార్లలో ప్రయాణిస్తుంటారు. కానీ ఆ వైద్యురాలు మాత్రం ఏమాత్రం వెనుకడుగేయలేదు. వైద్య సిబ్బందితో కలిసి కాలి నడకన వాగులు దాటి, కొండకోనల్లో నుంచి ఏజెన్సీ ప్రాంతానికి చేరుకున్నారు.

వైద్యో నారాయణో హరీ

వాగులు, వంకలు లెక్కచేయకుండా గిరిజనుల కోసం కదలొచ్చిన డాక్టర్‌ సంధ్యారాణి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల వైద్యారాలిగా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా విపత్తు వేళ... ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం సేవలందించిన సంధ్యారాణి.... గిరిజన తండాల్లో వైరస్‌ కట్టడిలో కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఇటీవల వర్షాల కారణంగా కిన్నెరసాని వాగు ఉప్పొంగుతోంది. పైన వర్షం.... కింద పొంగుతున్న వాగును దాటుకుంటూ.... మందులను తీసుకుని ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లి సేవలందిస్తున్న సంధ్యారాణి.... వైద్యో నారాయణో హరీ.. అన్న పదానికి సార్థకం చేస్తున్నారు.

గిరిపుత్రుల ధన్వంతరి

వర్షంలోనూ వాగులు దాటుతూ మందులు తడవకుండా భద్రంగా తీసుకెళ్తున్నారు. అనారోగ్యంగా ఉన్న వారికి రక్త పరీక్షలు చేసి... మందులు అందజేస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో విశిష్ట సేవలు అందించారు. ధన్వంతరి వారసులం.. ధరణిలో దేవతలమన్న నానుడికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.

వాగు దాటుతున్న వైద్యురాలు

ఇదీ చదవండి: 'రోడ్డుపై గుంత కనిపిస్తే ఆయన ఆగలేరు... వెంట వెళ్లకుండా నేనూ ఉండలేను'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.