DGP in Maoist affected areas: ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులను మన రాష్ట్రంలోకి రానీయకుండా సరిహద్దుల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ముందుగా చర్ల మండలంలోని చెన్నాపురం బేస్ క్యాంపు వద్దకు వెళ్లి అక్కడి భద్రతా బలగాలకు సూచనలిచ్చారు.
DGP Mahender reddy: ప్రజల సహకారంతో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను మావోయిస్టు రహిత జిల్లాలుగా తీర్చిదిద్దడానికి ముందుకు సాగుతున్నామని అన్నారు. అనంతరం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్లో సీఆర్పీఎఫ్ అడిషనల్ డీజీపీ రష్మీ శుక్ల, ఐజి నాగిరెడ్డి, జిల్లా పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ
DGP visit Bhandari kothagudem: తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉందని తెలిపారు. సరిహద్దు జిల్లాలను మావోయిస్టు రహితంగా మార్చడంలో ప్రజల సహకారం మరువలేనిదన్నారు. అందుకు జిల్లా పోలీసులు ఎంతగానో కృషి చేస్తూ సహకరిస్తున్నారని ప్రజలను అభినందించారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మావోయిస్టు రహిత జిల్లాగా ఇప్పటికే సాధించుకున్నామని తెలిపారు. అందుకు ముఖ్యంగా ప్రజల సహకారమే కారణమని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
'అంతర్రాష్ట సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు. మావోయిస్టులను అడ్డుకోవడంలో ముందున్నారు. తెలంగాణను మావోయిస్టు రహితంగా తీర్చి దిద్దడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు అందరి సహకారం అవసరం. ఈ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. గతేడాది కాలంగా రాష్ట్రంలో మావోయిస్టుల కదలిక లేదు. ప్రస్తుతం మావోయిస్టులు అధికంగా ఛత్తీస్గఢ్లో ఉన్నారు. ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో మావోయిస్టు రహిత రాష్ట్రంగా కొనసాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.' - మహేందర్ రెడ్డి, డీజీపీ
ఇవీ చూడండి: