ETV Bharat / state

ఇల్లందు అభివృద్ధిని కేటీఆర్ మెచ్చుకున్నారు : హరిప్రియ - ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పాల్గొన్నారు. పలు వార్డుల్లో పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మహిళా స్వశక్తి భవనాన్ని ఆమె ప్రారంభించారు.

development works started by mla haripriya naik in illendhu khammam district
ఇల్లెందు అభివృద్ధిని కేటీఆర్ మెచ్చుకున్నారు : ఎమ్మెల్యే
author img

By

Published : Dec 11, 2020, 4:05 PM IST

ఇల్లందులో నీటి సమస్యను తీర్చేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్​ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వైకుంఠధామం, మిషన్​ భగీరథ ట్యాంక్ పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రభుత్వం నిర్మించిన మహిళా స్వశక్తి భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

పట్టణ అభివృద్ధికి పురపాలక అధికారులు, ప్రజాప్రతినిధులు కష్టపడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇటీవల ఖమ్మం పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ సైతం పనితీరును మెచ్చుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్​ దిండిగాల రాజేందర్, పురపాలక ఛైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, పురపాలక అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్ర రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది: సీఎస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.