ప్రైవేటు వైద్యశాలలో కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం కరోనా తీవ్రస్థాయిలో ఉన్నందువల్ల ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
ఇందులో భాగంగా కరోనా వైద్య చికిత్స కోసం ప్రైవేటు వైద్యశాలలో అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు.
ఇవీ చూడండి: 'లాక్డౌన్ కాలంలో విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి'