పురపాలక ఎన్నికల్లో భాజపాయేతర పార్టీలతో కలిసి సీపీఐ ముందుకు సాగనుందని... ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. ముందుగా లెఫ్ట్ పార్టీలకు ప్రాధాన్యత ఉంటుందన్న ఆయన... తెదేపా, కాంగ్రెస్తో పాటు స్థానికతను బట్టి తెరాసతోనూ పొత్తులు ఉండే అవకాశం ఉందన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొత్తులు ఎలా ఉన్నా... కొత్తగూడెంలో మాత్రం తెరాసతోనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. పురపాలక ఎన్నికల ప్రక్రియలో ఈసీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రిజనర్వేషన్ల ఖరారులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆక్షేపించారు. ఎన్నికలు వాయిదా వేసి... రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: "ఎన్నికల సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలి"