భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో లాక్డౌన్ కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ నుంచే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహన చోదకులు ఎవరైనా అనారోగ్య లక్షణాలు కనపిస్తే అనుమతించడం లేదు. నిత్యావసర వస్తువులు మినహా మిగతా వాహనాలను అనుమతించడం లేదు.
భద్రాచలం పట్టణంలో నేటి నుంచి ఐటీసీ పీఎస్పీడీ సౌజన్యంతో పలు కాలనీల్లో సోడియం హైపో ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. కార్యక్రమాన్ని ఐటీసీ ప్రతినిధి చెంగల్ రావు, భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర, పట్టణ ప్రముఖులు పాకాల దుర్గాప్రసాద్, పంచాయితీ రాజ్ ఈవో శ్రీనివాస రావు తదితరులు ప్రారంభించారు.
ఇదీ చూడండి : కరోనా మృతులపై రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు