ETV Bharat / state

సీఎం కృషికి ఫిదా... కారెక్కుతున్న హరిప్రియ - HARIPRIYA

కాంగ్రెస్​ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. కారులో ఎక్కేందుకు హస్తం నేతలు క్యూ కట్టారు. ఇప్పటికే పలువురు శాసనసభ్యులు గులాబీ తీర్థం పుచ్చుకోగా... తాజాగా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్​ తెరాసలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

ఇక సారు బాటలోనే...
author img

By

Published : Mar 10, 2019, 7:27 PM IST

Updated : Mar 10, 2019, 7:47 PM IST

ఇక సారు బాటలోనే...
ఇల్లెందు కాంగ్రెస్​ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్​ తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్​ చేస్తున్న కృషికి మంత్ర ముగ్ధురాలైనట్లు హరిప్రియ తెలిపారు. తమ నియోజకవర్గ అభ్యున్నతికై గులాబీనేత బాటలో పయనించేందుకు నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.

కారు గుర్తుపై పోటీ....
బంగారు తెలంగాణ నిర్మాణంలో తాను భాగస్వామ్యం అవుతానన్న హరిప్రియ... అవసరమైతే కాంగ్రెస్​కు రాజీనామా చేసి తెరాస బీ ఫామ్​పై పోటీ చేసేందుకు సిద్ధమని వెల్లడించారు.
ఇవీ చూడండి:రేపు తెరాస శాసనసభాపక్ష సమావేశం

Last Updated : Mar 10, 2019, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.