ETV Bharat / state

కొత్తగూడెం సీటు వ్యవహారం - ఇంతకీ ఆ సీటు వామపక్షాలకు ఇచ్చినట్టేనా? - గాంధీభవన్‌ వద్ద కాంగ్రెస్‌ నేతలు నిరసన

Congress Kothagudem Seat Issue : కొత్తగూడెం సీటు ప్రస్తుతం హాట్ టాపిక్​గా మారింది. తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించింది. దీంతో కాంగ్రెస్ నేతలు అసంతృప్త వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నేత ఎడవల్లి కృష్ణ.. తాను మాత్రం పోటీలో ఉంటానని చెబుతున్నారు. అధిష్ఠానం పునరాలోచన చేసి.. తనకే బీ ఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌కే గెలిచే బలం ఉందని.. పలు సర్వేల ద్వారా ఏఐసీసీ తెలుసుకున్నప్పటికీ సీటును సీపీఐకి కేటాయించడం అన్యాయమన్నారు.

Wanaparthy Congress Leaders
Congress Kothagudem Seat Issue
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2023, 2:49 PM IST

Updated : Nov 7, 2023, 4:08 PM IST

Congress Kothagudem Seat Issue : కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయిస్తారన్న ప్రచారం నియోజకవర్గంలో చిచ్చురేపింది. వామపక్షాలకు టికెట్‌ ఇచ్చినా.. తాను మాత్రం పోటీలో ఉంటానని కాంగ్రెస్‌ నేత ఎడవల్లి కృష్ణ ప్రకటించారు. ఈ మేరకు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ నేతలతో సమావేశమైన ఆయన.. పార్టీ అధిష్ఠానం పునరాలోచించి తనకే బీఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో పార్టీ బలంగా ఉందని.. కొన్నాళ్లుగా కాంగ్రెస్‌ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని పలు సర్వేలు సైతం చెబుతున్నాయని.. పార్టీ టికెట్‌ ఇవ్వకపోయినా పోటీలో ఉండేది మాత్రం తప్పనిసరి అని స్పష్టం చేశఆరు.

Wanaparthy Congress Leaders protest At Gandhi Bhavan : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి టిక్కెట్​ రద్దుపై.. ఆయన అనుచరులు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు. చిన్నారెడ్డి పేరును రెండో జాబితాలో ప్రకటించి.. మూడో జాబితాలో రద్దు చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు సర్వేలతో, డబ్బులు లేవని సాకులతో అభ్యర్థిని మార్చడం సరికాదని.. వనపర్తి జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉన్న చిన్నారెడ్డి టిక్కెట్‌ విషయంపై అధిష్ఠానం పునరాలోచన చేయాలని రాజేంద్రప్రసాద్‌ కోరారు. అధిష్ఠానం స్పందించకపోతే రెండు, మూడూ రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. 45 ఏళ్లుగా ఒక నిబద్ధతతో పార్టీ బతకాలని చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేర్కొన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారని.. అప్పుడే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చని.. కానీ, ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డకుండా నిజాయితీతో పని చేశారని డీసీసీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

కాంగ్రెస్-సీపీఐ పొత్తు కుదిరింది - కొత్తగూడెం బరిలో కూనంనేని

Telangana Congress MLA Candidates 2023 : మరోవైపు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాలుగు నియోజకవర్గాలు మినహా.. అన్నింటికీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి జాబితా(Congres First List)లో 55 నియోజకవర్గాలకు.. రెండో జాబితాలో 45 నియోజకవర్గాలకు.. మూడో జాబితాలో 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మూడో జాబితా అభ్యర్థులు ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరించింది. ఒకవిధంగా చెప్పాలంటే సుదీర్ఘ కసరత్తు చేసిందని చెప్పాలి. చాలా నియోజకవర్గాలలో గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులు ఉండడం.. రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం.. కొత్తగా పార్టీలో చేరికలు ఉండడం తదితర కారణాలతో మూడో జాబితా విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది.

ఆ రెండు స్థానాల అభ్యర్థులు మార్పు : 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మరో రెండు నియోజకవర్గాలకు మార్పులు, చేర్పులను చేసింది. వనపర్తి మాజీ మంత్రి చిన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డిని.. అదేవిధంగా బోథ్ నుంచి ముందు ప్రకటించిన వెన్నెల అశోక్ బదులు ఆదే గజేందర్‌లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా భీమ్ భరత్​ను ప్రకటించిన కాంగ్రెస్.. తాత్కాలికంగా పక్కన పెట్టగా.. ఆ స్థానంలో మరొక అభ్యర్థిని ప్రకటిస్తారన్న ప్రచారానికి తెర పడింది. తాజాగా భరత్‌కు మాణిక్ రావు ఠాక్రే బీఫామ్ అందజేయడంతో ఆయన టికెట్ ఖరారైంది.

ఇదిలా ఉండగా.. గాంధీభవన్ ఆవరణలో బెల్లయ్య నాయక్ నిరాహార దీక్ష చేపట్టారు. టికెట్‌ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ గాంధీ విగ్రహం ముందు ఆయన నిరాహార దీక్షకు దిగారు. అదేవిధంగా గాంధీభవన్‌ వద్ద పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆందోళనల నేపథ్యంలో గాంధీభవన్‌ గేటుకు సిబ్బంది తాళం వేసినట్లు తెలుస్తోంది. ఆందోళనకారులకు దామోదర రాజనర్సింహ ఫోన్ చేసినట్లు సమాచారం.

కేసీఆర్ సర్కార్ వైఫల్యాలే ఆయుధంగా ప్రజల్లోకి విపక్షాలు

16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల, కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి

Last Updated : Nov 7, 2023, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.