భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను కలెక్టర్ ఎం.వి. రెడ్డి పరిశీలించారు. పాల్వంచ మండలం నాగారం సమీపంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు కాలువ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం ప్రాజెక్ట్ ఇంజినీర్లతో, కాంట్రాక్టర్లతో చర్చించి సూచనలు చేశారు. పనులు ఎట్టిపరిస్థితుల్లో ఆలస్యం కాకూడదని.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులను వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చి వైద్య అధికారుల పర్యవేక్షణలో పనులు కొనసాగించవలసిందిగా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: థర్మల్ వెలుగుల్లో తెలంగాణ నంబర్ వన్