ETV Bharat / state

ఆదివాసీ పల్లెలో పోలీసుల 'జలకళ' - గుత్తికోయల తాగునీటి సమస్య తీర్చిన చర్ల పోలీసులు

గ్రామంలో ప్రజల తాగునీటి సమస్యను చూసి చలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు... క్రాంతిపురంలో చేతిపంపు ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారుల సాహకారంతో ఏర్పాటు చేసి ఇవాళ ప్రారంభించారు.

charla police arrange hand pump in kranthipuram
సమస్య చూసి చలించారు.. ఇప్పుడు పరిష్కరించారు
author img

By

Published : Jan 26, 2021, 3:26 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం క్రాంతిపురంలో పోలీసులు ఏర్పాటు చేసిన చేతిపంపును ఇవాళ ప్రారంభించారు. గతంలో గ్రామాన్ని పోలీసులు సందర్శించినప్పుడు గుత్తికోయలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను చూసి చలించిపోయారు.

ఎస్పీ సునీల్ దత్​, ఓఎస్డీ తిరుపతి, ఏఎస్పీ వినీత్​కు సమస్య వివరించి... పరిష్కారించారు. చేతిపంపును ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను దూరం చేశారు. చర్ల మండల ప్రజల సమస్యలు తీర్చడానికి అన్ని విధాలు గా సాయపడతామని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: ప్రగతి భవన్​లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.