ETV Bharat / state

తెలంగాణలో ఛాలెంజ్​ ఓటు వేసిన ఒక్కమగాడు - ఎక్కడో తెలుసా? - ఛాలెంజ్​ ఓటు అంటే ఏమిటి

Challenging Vote in Bhadradri Kothagudem : ప్రజాస్వామ్యంలో అత్యంత బలమైన ఆయుధం ఓటు.. మంచి పాలన కావాలంటే జీవించి ఉన్నంతకాలం వినియోగిస్తూనే ఉండాలి. రాష్ట్రంలో తొలిసారి ఓటు హక్కు పొందిన యువత.. పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు ఓటు వేసేందుకు వెళ్తే.. అప్పటికే తన ఓటు నమోదయిందని అధికారులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి ఛాలెంజ్ ఓటు వేశాడు. ఇంతకీ ఛాలెంజ్ ఓటు అంటే ఏంటి..?

Importance of Challenging Vote
Challenging Vote in Bhadradri Kothagudem
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2023, 1:57 PM IST

Challenging Vote in Bhadradri Kothagudem : ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో ఓటర్లు ఆసక్తి చూపారు. కొందరు అనారోగ్య సమస్యలు ఉన్నా వెనకడుగు వేయకుండా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు వేశారు. యువకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఓటు వేశారు. పట్టణాల్లో ఓటు శాతం తక్కువగా వచ్చినా.. గ్రామాల్లో ఫర్వాలేదు అనిపించింది. రాష్ట్రంలో 70.66 పోలింగ్​ శాతం నమోదైంది. పలు చోట్ల చిన్న చిన్న వాగ్వాదాలు అయినా.. పోలీసులు ముందస్తు చర్యల వల్ల ప్రశాంతంగా ముగిశాయి.

Man Uses Challenging Vote in Telangana Polling 2023 : పోలింగ్​ ప్రక్రియలో ఎన్నికల సంఘం కల్పించిన హక్కులు అన్ని ఓటర్లుకు పూర్తిగా తెలియవు.. అవగాహన పరిచినా కొంత మేరకే గుర్తు ఉంటాయి. అయితే ఆ హక్కు వినియోగించుకున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికీ ఇలా కూడా చేయవచ్చా అనే ఆశ్చర్యం కలుగుతుంది. సరిగ్గా గురువారం జరిగిన పోలింగ్​లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇలానే జరిగింది.

ఓ వ్యక్తి తన ఓటు వేసేందుకు పోలింగ్​ కేంద్రానికి(Polling Center in Bhadradri) వెళ్లాడు.. అప్పటికే తన ఓటు వేరే ఎవరో వేశారని పోలింగ్​ అధికారి చెప్పడంతో షాక్​ అయ్యాడు. అనంతరం ఆలోచించి తనకు ఎన్నికల సంఘం కల్పించిన హక్కును వినియోగించుకున్నాడు. అదే ఛాలెంజ్​ ఓటు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఒక్క ఛాలెంజ్​ ఓటు మాత్రమే నమోదయిందని అధికారులు తెలిపారు. అసలేం జరిగిందంటే..?

అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరిచిన ఈవీఎంలు

Challenging Vote registered in Telangana Elections
ఛాలెంజ్ ఓటు వేసిన నరేందర్

Challenging Vote at Yellandu : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలో బర్లగూడెం గ్రామానికి చెందిన పూనెం నరేందర్​కు ఒడ్డుగూడెం పోలింగ్ బూత్ నంబర్ 137లో ఓటు ఉంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లగా.. అప్ప టికే తన ఓటును మరొకరు వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. తాను ఓటు వేయలేదని ప్రిసైడింగ్ అధికారిని ప్రశ్నించగా.. నరేందర్​తో రూ.2 కట్టించుకుని బ్యాలెట్ పద్ధతి(Ballot Process)లో ఛాలెంజ్ ఓటు వేయించారు. ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా వచ్చినపుడు మాత్రమే ఈ ఓటును పరిగణనలోకి తీసుకుంటారు.

తెలంగాణలో 70.66% పోలింగ్‌ - మళ్లీ పట్నం బద్ధకించింది - పల్లె ఓటెత్తింది

What Is Challenge Vote : ఎవరైనా ఓటేయడానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న పోలింగ్ ఏజెంట్‌.. ఓటరు జాబితాలో ఉన్న వ్యక్తి మీరు కాదు అని అభ్యంతరం తెలిపితే.. అప్పుడు ఛాలెంజ్​ ఓటును ఉపయోగించుకోవాలి(Importance of Challenging Vote). ఈ ఓటు వేసిన ఫిర్యాదుదారుడి నుంచి సంబంధిత ఎన్నికల అధికారి రూ.2 రుసుం తీసుకుని రసీదు ఇస్తారు. వచ్చిన ఓటరు అసలైన వ్యక్తా.. కాదా అని విచారిస్తారు. అసలైన ఓటరు అని తేలితే అతడికి ఓటు హక్కు కల్పించి రూ.2 తిరిగి ఇచ్చేస్తారు. నిజమైన ఓటరు కాని పక్షంలో ఓటరు నుంచి రూ.2 తీసుకుని ఏజెంట్‌కు అందించి.. సదరు వ్యక్తిని ఓటు వేసేందుకు అనర్హుడిగా ప్రకటిస్తారు.

ఉమ్మడి వరంగల్​లోని పలు​ పోలింగ్​ కేంద్రాల్లో ఉద్రిక్తతలు - పోలీసుల లాఠీ ఛార్జీ

ఎన్నికల్లో వెల్లివిరిసిన ఓటరు చైతన్యం - మధ్యాహ్నం తరువాత పోలింగ్‌ కేంద్రాల వద్ద పెరిగిన రద్దీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.