Case Booked Against Person For Forging TSGENCO CMD Signature : టీఎస్ జెన్కోలో ఉద్యోగం వచ్చిందని నకిలీ అపాయింట్ లెటర్ ఇచ్చిన ఓ వ్యక్తిపై జెన్కో విజిలెన్స్(GENCO Vigilence) అధికారులు ఖైరతాబాద్ పోలీసు స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదు చేశారు. భద్రాచలంలోని ఐటీసీ సంస్థలో ఉద్యోగి అయిన ప్రవీణ్ తనకు జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు(GENCO CMD Prabakar Rao)తో మంచి సంబంధాలున్నాయని అదే సంస్థలో కార్మికుడిగా పని చేస్తున్న మాడపాటి రాజశేఖర్‌కు చెప్పాడు. అంతేకాకుండా సంస్థలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకు తనకి రూ.10 లక్షలు ముట్టజెప్పాలనే ఒప్పందంతో రాజశేఖర్‌తో బేరం కుదుర్చుకున్నాడు.
'శ్రీశైలం ఘటనపై కమిటీ వేశాం.. కుటుంబాలకు అండగా ఉంటాం'
Cheeting Case On Tsgenco Employee 2023 : ఉద్యోగం వచ్చిన తర్వాతే డబ్బు ఇస్తానని రాజశేఖర్ చెప్పాడు. దీంతో డబ్బులు ఎలాగైనా చేతింకాదాలనే ఉద్దేశ్యంతో ప్రవీణ్ ఈ నెల 29న రాజశేఖర్‌కు మణుగూరులో ఉద్యోగం వచ్చినట్లు, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు పేరిట అపాయింట్‌మెంట్ ఆర్డర్ కాపీని ఇచ్చాడు. ముందుగా అనుకున్న ప్రకారం డబ్బులు ఇవ్వమని కోరాడు. అయితే నియామక పత్రాన్ని నేరుగా ఇవ్వకుండా వాట్సాప్ ద్వారా పంపించాడు ప్రవీణ్.
తక్కువ వ్యవధిలో ఉద్యోగం ఇప్పించేసరికి రాజశేఖర్‌కు నమ్మకం కుదరలేదు. అనుమానంతో కూకట్‌పల్లికి చెందిన ఎన్. సురేంద్రకుమార్ అనే వ్యక్తికి ఆ నియామక పత్రం చూపించాడు. ప్రవీణ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గురించిన విషయం చెప్పి విచారించమని కోరాడు. అతడు ప్రవీణ్ ఇచ్చిన ఆర్డరు పత్రంతో ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌధకు వెళ్లి అధికారులను కలిసి ఆరా తీశాడు.
విద్యుత్ కార్యాలయంలోని విజిలెన్స్ విభాగం వారు విచారించగా నియామక పత్రం నకిలీదని తేలింది. దానిపై జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సంతకం ఉండడంతో విజిలెన్స్ అధికారులు అది ఫోర్జరీ సంతకం అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖైరతాబాద్ పోలీసులు ప్రవీణ్‌పై ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Fake job racket busted: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
Transco Genco CMD Signature Forgery : ఓ వ్యక్తి అక్రమంగా తన సంతకం ఫోర్జరీ చేసి మోసం చేయడానికి ప్రయత్నించిన విషయం తెలుసుకున్న ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు దీనిపై స్పందించారు. విద్యుత్ సంస్థలో ఉద్యోగాలిప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మొద్దని, సంస్థలో ఉద్యోగాలకు ఖాళీలు ఉంటే వాటికి నోటిఫికేషన్లు ఇస్తామని, సంబంధిత విభాగాల్లో అవసరమైన నైపుణ్య పరీక్షలు నిర్వహించి వారి అర్హతల ఆధారంగానే అభ్యర్తులను ఎంపిక చేస్తామని ఈ తరహాలోనే సంస్థలో ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని, ఇందులో మధ్యవర్తుల ప్రమేయం ఏమాత్రం ఉండదని, ప్రస్తుతం విద్యుత్ సంస్థలో ఖాళీలు లేవని సీఎండీ ప్రభాకర్‌రావు స్పష్టం చేశారు. ఎటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు.