ETV Bharat / state

BRS Political Heat in Yellandu : ఎన్నికల వేళ.. ఇల్లందులో రసవత్తరంగా బీఆర్ఎస్ రాజకీయం - నవంబర్ 1న ఇల్లందులో కేసీఆర్ బహిరంగ సభ

Minister Satyavathi Meets Dissenting Councillors in yellandu : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్​లో ఇంకా కొన్నిచోట్ల అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి. ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్​ను బీఆర్ఎస్​ అభ్యర్థిగా నిలబెట్టొద్దని.. పలువురు నేతలు గత కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్​తో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో అసమ్మతిని చల్లార్చే బాధ్యతను కేటీఆర్.. మంత్రి సత్యవతి, ఎంపీ వద్దిరాజుకు అప్పగించారు. ఈ మేరకు వారు నేతలతో సమావేశమమై చర్చలు జరిపారు.

Yellandu
Yellandu
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 10:05 PM IST

BRS Political Heat in Yellandu : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) వేళ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రాజకీయాలు వేడెక్కాయి. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టొద్దని.. పలువురు నేతలు గత కొంతకాలంగా అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఈ విషయం మంత్రి కేటీఆర్‌ (Minister KTR)తోనూ చర్చించారు. అభ్యర్థి ఎంపిక(BRS Candidate Selection) విషయం పార్టీకి వదిలేయాలని వారికి సర్దిచెప్పిన మంత్రి, నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం కృషి చేయమని అసమ్మతి నాయకులకు సూచించారు. అయినప్పటికీ నేతల మధ్య అసంతృప్తి కొనసాగుతుండడంతో.. ఇల్లందు నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ రాజకీయం రసవత్తరంగా మారింది.

Satyavathi Participated Dissenting Councillors Meeting in yellandu : ఈ నేపథ్యంలోనే అసమ్మతిని చల్లార్చే బాధ్యతను కేటీఆర్‌.. మంత్రి సత్యవతి రాఠోడ్‌(Minister Satyavathi Rathod), ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు అప్పగించారు. వారు ఈరోజు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌తో కలిసి.. మున్సిపల్‌ ఛైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, అసమ్మతి గళం వినిపిస్తున్న పలువురు నాయకులతో చర్చలు జరిపారు. తొలుత అసమ్మతి గళం వినిపిస్తున్న మున్సిపల్ ఛైర్మన్‌ డీవీ ఇంటికి.. మంత్రి సత్యవతి రాఠోడ్‌, ఎంపీ వద్దిరాజు వెళ్లారు. ఆయనను బుజ్జగించి.. ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు.

CM KCR Election Tour : సీఎం కేసీఅర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు.. ఈనెల 15 నుంచి నవంబర్ 9 వరకు..

KCR Public Meeting at Yellandu on 1st November : ఈ పరిణామంతో మున్సిపల్ ఛైర్మన్‌తో విభేదిస్తూ వస్తున్న పలువురు ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లు(Councillors) అలిగారు. దీంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అయితే వచ్చే నెల 1న ఇల్లందులో కేసీఆర్‌ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్​లో నెలకొన్న అసంతృప్తి సెగలు అప్పటికి చల్లారుతాయా లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Minister Satyavathi Comments on BJP and Congress : అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సభ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి సత్యవతి, ఎంపీలు కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే హరిప్రియ, మహబూబాబాద్ జడ్పీ ఛైర్మన్ బిందు సమీక్ష నిర్వహించారు. సభకు భారీ సంఖ్యల్లో జనాన్ని తరలించేలా చర్యలు చేపట్టాలని సత్యవతి రాఠోడ్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి జరగకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడ్డుకుంటుందని ఆరోపించారు. ఈ ప్రాంతంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా అన్యాయం చేశారని విమర్శించారు.

ఇల్లందు నియోజకవర్గంలో 65 ఏళ్లలో జరగని అభివృద్ధి.. బీఆర్ఎస్​ పాలన పదేళ్లలో జరిగిందని సత్యవతి రాఠోడ్ తెలిపారు. దీనికి ఇల్లందు మున్సిపాలిటీనే నిదర్శనమన్నారు. దేశంలో ఏ పార్టీ ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను పార్టీ ప్రవేశపెట్టిందని చెప్పారు. సమర్థ పాలనతో దేశంలోనే పలు రంగాల్లో.. అనేక రాష్ట్రాల కంటే అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు.

Minister Satyavati Rathod Crying in BRS Meeting : వారిని తలచుకుంటూ.. కన్నీరు పెట్టుకున్న మంత్రి సత్యవతి రాథోడ్‌

Satyavathi Rathod Responded on Anganwadi Workers Protest : 'అంగన్​వాడీల రెగ్యులరైజేషన్ కేంద్రంతో ముడిపడి ఉంది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.