ETV Bharat / state

ఎమ్మెల్యే నేతృత్వంలో తెరాసలోకి పలు పార్టీల నాయకులు - ఎమ్మెల్యే హరిప్రియ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు తెరాసలో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

bjp, congres parties leaders join into the trs in khammam ellandu
తెరాసలో పలు పార్టీ నాయకుల చేరికలు
author img

By

Published : Mar 3, 2020, 10:45 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మంత్రి కేటీఆర్​ పాల్గొన్న సభను విజయవంతం చేయడం పట్ల కార్యకర్తలకు, ప్రజలకు ఎమ్మెల్యే హరిప్రియ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, పలువురు నాయకులు హాజరయ్యారు.

క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలోనే భాజాపా, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో తెరాసలో చేరారు. ఇందులో మాజీ కౌన్సిలర్లు రవినాయక్,​ స్వర్ణలత, తుడుందెబ్బ నాయకులు నర్సింహరావు నాయకత్వంలో వచ్చిన పలువురు నేతలకు హరిప్రియ కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి వివిధ పార్టీ నాయకులు తెరాలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు.

తెరాసలో పలు పార్టీ నాయకుల చేరికలు

ఇవీ చూడండి: హైదరాబాద్‌లో కరోనా కేసు... రేపు మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.